News February 12, 2025
నన్ను రాజకీయాల్లోకి లాగకండి: విశ్వక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739302208751_893-normal-WIFI.webp)
తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్సేన్ నెటిజన్లను కోరారు. తాను మిడిల్ ఫింగర్ చూపిస్తున్న పోస్టర్ నెల రోజుల క్రితం విడుదలైందని, రెడ్ సూట్ ఫొటో కూడా ఇప్పటిది కాదని చెప్పారు. ‘ప్రతీసారి తగ్గను. కానీ నిన్న మనస్ఫూర్తిగా <<15423495>>సారీ<<>> చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. శాంతంగా ఉండండి. అసభ్య పదజాలం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైలాను బాయ్‌కాట్ చేయాలన్న ఆలోచనను బాయ్‌కాట్ చేయండి’ అని X పోస్ట్ పెట్టారు.
Similar News
News February 12, 2025
‘లైలా’కు నందమూరి అభిమానుల మద్దతు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739321039480_1226-normal-WIFI.webp)
నటుడు పృథ్వీ వ్యాఖ్యలతో <<15413032>>బాయ్‌కాట్ లైలా<<>> అంటూ వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హీరో విశ్వక్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ వారు వెనక్కితగ్గలేదు. ఈక్రమంలో ఆయనకు మద్దతుగా నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్‌కాట్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
News February 12, 2025
వాన్స్ కుటుంబంతో పీఎం మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739319894224_367-normal-WIFI.webp)
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబాన్ని కలిశారు. వాన్స్, ఆయన భార్య ఉష చిలుకూరి, వారి పిల్లలతో కలిసి ఫొటో దిగారు. వివిధ అంశాలపై మంచి చర్చ జరిగిందని పేర్కొన్నారు. తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ అద్భుతంగా ఉన్నాయని వాన్స్ ట్వీట్ చేశారు. పిల్లలు ఆయన్ను ఎంతో ఇష్టపడ్డారని రాసుకొచ్చారు. కాగా ఉష తల్లిదండ్రులది ఏపీలోని కృష్ణా జిల్లా.
News February 12, 2025
మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గింది: కేంద్రం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739319542250_893-normal-WIFI.webp)
గత ఆరేళ్లలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 38కి తగ్గిందని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. నేషనల్ పాలసీ&యాక్షన్ ప్లాన్-2015 అమలు చేసినప్పటి నుంచి LWE ప్రభావిత ప్రాంతాల్లో 4,000kmsకి పైగా రోడ్లు నిర్మించామని తెలిపింది. కనెక్టివిటీని మెరుగుపరచడానికి 1,300కి పైగా టెలికాం టవర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో LWE ప్రభావిత రాష్ట్రాలకు ₹1,925.83crs విడుదల చేశామని వివరించింది.