News August 9, 2024
ఆ భాగం రీప్లేస్ చేసేవరకు ఆల్టో కే10 నడపొద్దు: మారుతి

ఆల్టో కే10 మోడల్లో 2555 కార్లను మారుతీ సుజుకీ తాజాగా రీకాల్ చేసింది. ఒక బ్యాచ్ కార్లలో స్టీరింగ్ గేర్ బాక్స్ లోపాన్ని గుర్తించామని, ఆ కార్లు కొనుగోలు చేసిన యజమానులందరినీ సంప్రదిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. అరుదైన సందర్భాల్లో స్టీరింగ్ పనితీరు విఫలం కావొచ్చని వివరించింది. అందువలన ఆ విడిభాగాన్ని రీప్లేస్ చేసేవరకు ఆయా కార్ల యజమానులు వాటిని నడపొద్దని సూచించింది.
Similar News
News April 10, 2026
IPLలో నయా హిట్టర్.. సినిమా చూపించాడు!

KKRతో మ్యాచులో ఓడిపోతుందనుకున్న LSGకి యువ బ్యాటర్ ముకుల్ చౌదరి మరుపురాని <<19611824>>విజయాన్ని<<>> అందించారు. 16 ఓవర్ల తర్వాత LSG విజయానికి 24 బంతుల్లో 54 రన్స్ కావాలి. అప్పటికే మెయిన్ బ్యాటర్లందరూ ఔటవడంతో LSG ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ముకుల్ 2 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడ్డారు. చివరి 4 ఓవర్లలో ఆయనొక్కరే 52 పరుగులు చేయడం గమనార్హం.
* మ్యాచ్ ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.
News April 10, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News April 10, 2026
ఏప్రిల్ 10: చరిత్రలో ఈరోజు

1894: వ్యాపారవేత్త ఘనశ్యాం దాస్ బిర్లా జననం
1898: స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత దశిక సూర్యప్రకాశరావు జననం
1995: భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి మరణం (ఫొటోలో)
✦ ప్రపంచ హోమియోపతి దినోత్సవం
✦ అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం


