News June 10, 2024

విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపకండి!

image

T20 WCలో విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపడం కలిసి రావట్లేదు. ఫస్ట్ 2 మ్యాచుల్లో కింగ్ ఫెయిల్ అయ్యారు. ఐర్లాండ్‌తో తొలి మ్యాచులో 1 రన్ మాత్రమే చేసిన విరాట్.. నిన్న PAKపై 4 పరుగులు చేశారు. విరాట్ తొలి ఓవర్లలో ఔట్ కావడంతో మిడిల్ ఆర్డర్‌లో అనుభవజ్ఞుడైన ప్లేయర్ లోటు ఏర్పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మకు జోడీగా యువ సంచలనం యశస్వీ జైస్వాల్‌ను పంపితే బెటర్ అంటున్నారు.

Similar News

News September 11, 2025

రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్‌లో క్యాంపస్ నియామకాలు!

image

క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఇన్ఫోసిస్ సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ల నియామకం కోసం కాలేజీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సీనియర్ ఉద్యోగులకు ఆ సంస్థ మెయిల్స్ పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కరోనా సంక్షోభం తర్వాత ఇన్ఫోసిస్‌, ఇతర కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను తగ్గించేశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కొత్తగా 20,000 మందిని తీసుకునే ఛాన్సుంది.

News September 11, 2025

మంచి మనసు చాటుకున్న లారెన్స్!

image

నటుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. చెన్నై రైళ్లలో స్వీట్ అమ్ముతూ బతుకు బండిని నడిపిస్తున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్యకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.లక్ష అందిస్తానని, ఆయన వివరాలు తెలిస్తే చెప్పాలంటూ Xలో ఫొటోను షేర్ చేశారు. రైలులో ఆయన కనిపిస్తే స్వీట్స్ కొని సపోర్ట్ చేయాలని కోరారు. ఫొటోలో ఉన్న కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదని తెలిపారు.

News September 11, 2025

టీమ్ ఇండియాకు ఇదే ఫాస్టెస్ట్ విన్

image

ఆసియా కప్‌లో భాగంగా నిన్న UAEతో <<17672914>>మ్యాచులో<<>> భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. UAE నిర్దేశించిన 58 పరుగుల టార్గెట్‌ను ఇండియా 4.3 ఓవర్లలోనే ఛేదించింది. మరో 93 బంతులు మిగిలి ఉండగానే విక్టరీని అందుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో తన ఫాస్టెస్ట్ విన్‌ను నమోదు చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాంట్లాండ్‌పై సాధించిన విజయమే (81 బాల్స్ మిగిలి ఉండగా గెలిచింది) రికార్డుగా ఉంది.