News April 7, 2025

ఇవి ఎక్కువ తినకండి: సీఎం చంద్రబాబు

image

AP: చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. చాలా వ్యాధుల నివారణకు నియంత్రిత ఆహారపు అలవాట్లు అవసరమని సూచించారు. ‘నలుగురు సభ్యుల కుటుంబంలో నెలకు 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల వంట నూనె, 3 కిలోల పంచదార వాడితే సరిపోతుంది. ఉప్పు, వంటనూనె, చక్కెర తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. రాష్ట్ర ప్రజలు ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.

Similar News

News November 24, 2025

డిటెన్షన్ సెంటర్లకు అక్రమ వలసదారులు: యూపీ సీఎం

image

అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను యూపీ CM యోగి ఆదేశించారు. ప్రతి జిల్లాలో తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విదేశీ పౌరసత్వం ఉన్న వలసదారుల వెరిఫికేషన్ పూర్తయ్యేవరకు డిటెన్షన్ సెంటర్లలో ఉంచాలని సూచించారు. వారు స్థిరపడిన విధానాన్ని బట్టి స్వదేశాలకు పంపించాలన్నారు. మరోవైపు 8ఏళ్లుగా అధికారంలో ఉండి ఇప్పుడు కావాలనే హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఆరోపించారు.

News November 23, 2025

ఇలా పడుకుంటే ప్రశాంతమైన నిద్ర

image

రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర కోసం ఎడమ వైపు పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ‘బోర్లా, వెల్లకిలా కంటే ఈ పొజిషన్‌లో మంచి నిద్ర వస్తుంది. గుండెకు రక్తసరఫరా, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శ్వాసలో ఇబ్బందులు, గురక సమస్య తగ్గుతుంది. ఎక్కువసేపు బోర్లా పడుకుంటే నడుము, మెడ నొప్పి, శ్వాస సమస్యలు పెరుగుతాయి. తల కింద దిండు అలవాటు ఉన్నవాళ్లు సాఫ్ట్ పిల్లోలను ఎంచుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News November 23, 2025

సైలెంట్‌గా iBOMMA రవి..! ఏం చేద్దాం?

image

నాలుగో రోజు పోలిస్ కస్టడీలోనూ iBOMMA రవి నోరు విప్పలేదని సమాచారం. తన పర్సనల్ విషయాలపై ప్రశ్నలకు బదులిచ్చాడు తప్ప ఈ వ్యవహారంలో తనతో ఉన్నది ఎవరు? డేటా థెఫ్ట్, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో రిలేషన్, ఫారిన్ ట్రిప్స్ తదితర అంశాలపై ప్రశ్నిస్తే మౌనంగా ఉన్నాడట. 5 రోజుల కస్టడీ సోమవారం ముగియనుంది. దీంతో మరోసారి కస్టడీకి అడిగితే కోర్టు ఎలా స్పందిస్తుంది? ఏం చేద్దామని అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం.