News April 7, 2024

ఆ విషయాన్ని మర్చిపోవద్దు: మోదీ

image

బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘INDIA’ కూటమి నేతలు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాలేదని విమర్శించారు. ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ పోల్ డాక్యుమెంట్‌లా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అన్ని సీట్లు NDAనే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News January 13, 2026

షాక్స్‌గామ్ వ్యాలీపై కన్నేసిన చైనా

image

జమ్ము కశ్మీర్‌లోని షాక్స్‌గామ్‌ వ్యాలీ ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా మరోసారి ప్రకటించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను పలుమార్లు భారత్ ఖండించింది. అయితే షాక్స్‌గామ్‌ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ మీడియా సమావేశంలో తెలిపారు. కాగా 1963లో పాక్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది.

News January 13, 2026

‘భోగి’ ఎంత శుభ దినమో తెలుసా?

image

భోగి నాడు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమ ‘భోగాన్ని’ పొందిన రోజు ఇదే. వామనుడి వరంతో బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే సమయమిది. ఆయనకు స్వాగతం పలికేందుకే భోగి మంటలు వేస్తారు. అలాగే ఇంద్రుడి గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన పవిత్ర దినమిది. పరమశివుని వాహనమైన బసవన్న శాపవశాన రైతుల కోసం భూమికి దిగి వచ్చిన రోజూ ఇదే. ఇలా భక్తి, ప్రకృతి, పురాణాల కలయికే ఈ భోగి పండుగ.

News January 13, 2026

తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ!

image

TG: రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఈనెల 18న మేడారం జాతర ప్రాంతంలో కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆమోదం, రైతు భరోసా పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మంత్రులు, కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి రానున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లు సమాచారం.