News September 6, 2024

వినాయక పూజలో ఇవి మరిచిపోవద్దు!

image

వినాయక చవితి రోజున ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే మంచిదని పురోహితులు చెబుతున్నారు. ప్రమిదలో కొబ్బరినూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగిస్తే గణనాథుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. 21 పత్రాలతో పూజించడం వీలుకాని వారు గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పించినా అంతే ఫలితం కలుగుతుంది. అలాగే, పండగ నాడు ఎరుపు/ నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.

Similar News

News January 8, 2026

వాహనదారులకు అలర్ట్.. ఈ విషయం తెలుసా?

image

హెల్మెట్, లైసెన్స్ ఉంటే సరిపోదు మీ వాహనం అన్-సేఫ్ కండిషన్‌లో ఉన్నా భారీ ఫైన్ తప్పదనే విషయం మీకు తెలుసా? MV యాక్ట్-2019 ప్రకారం మీ బైక్/కారులో లోపాలున్నా భారీ ఫైన్ విధిస్తారు. మీ వాహన లోపాల వల్ల ఇతరులకు ప్రమాదం జరగొచ్చని చర్యలు తీసుకోవచ్చు. ఇండికేటర్ పని చేయకపోయినా రూ.5వేలు ఫైన్/ 3 నెలలు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అందుకే మీ వాహనాన్ని ఓసారి చెక్ చేసుకోండి. SHARE IT

News January 8, 2026

బెండలో నీటి యాజమాన్యం, కలుపు నివారణ

image

బెండ విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. నల్లరేగడి నేలల్లో అయితే ప్రతి ఐదారు రోజులకు నీరు అందించాలి. పూత, కాయ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉంటే బిందుసేద్యం విధానం అనుసరించడం మంచిది. పంటకాలంలో 3 నుంచి నాలుగుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. విత్తనాలు వేసిన 2 వారాలకు కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలి. తర్వాత సమస్యను బట్టి కలుపును తొలగించుకోవాలి.

News January 8, 2026

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

image

AP: రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. అమరావతిపై <<18799615>>జగన్<<>> చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందనే చర్చ మొదలైంది. గతంలో తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనను ఈసారి అమలు చేస్తారనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రభుత్వం మారితే APకి రాజధాని మారుతుందా?, శాశ్వత క్యాపిటల్ ఉండదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.