News April 24, 2024
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: ఈడీ

లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్‌పై కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆమె అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని, బెయిల్ ఇవ్వొద్దని ఈడీ వాదిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కవిత స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయాల్సి ఉందని, బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు లాయర్ కోరారు. కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది.
Similar News
News December 4, 2025
ADB: పల్లె నుంచే గడ్డెన్న ప్రస్థానం..!

ముధోల్ నియోజకవర్గం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే పేరు గడ్డెన్న. భైంసా మండలం దేగం సర్పంచిగా మొదలైన ఆయన ప్రస్థానం 6 సార్లు ఎమ్మెల్యే ఓసారి మంత్రి వరకు కొనసాగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజం. అందుకే ఆయనంటే పల్లె ప్రజల్లో ఓ గౌరవం. గడ్డెన్న తన బిడ్డలను నేరుగా పెద్ద పదవులు కట్టబెట్టవచ్చు కానీ అలా చేయలేదు. కొడుకు విఠల్ రెడ్డిని సర్పంచ్‌గా పోటీ చేయించి, క్రమంగా శాసనసభ వరకు తీసుకెళ్లారు.
News December 4, 2025
179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్‌లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://cau.ac.in/
News December 4, 2025
దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.


