News September 24, 2024

అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దు: హైడ్రా

image

TG: బఫర్ జోన్, FTL పరిధిలో అక్రమ నిర్మాణాల కట్టడికి హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాసింది. రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో సమావేశమై సూచనలు చేయనున్నారు. దీని కోసం ఒక లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల కూల్చిన అక్రమ కట్టడాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల లిస్టును సిద్ధం చేశారు.

Similar News

News September 24, 2024

సారీ చెప్పిన కార్తీ.. స్పందించిన పవన్ కళ్యాణ్

image

AP: లడ్డూ విషయంలో చేసిన <<14180678>>వ్యాఖ్యలపై<<>> వెంటనే స్పందించిన హీరో కార్తీని Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. తిరుమల లడ్డూ అంశం లక్షల మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉందని, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని గుర్తించినట్లు పవన్ పేర్కొన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పట్ల బాధ్యతతో ఉండాలని తెలిపారు. మరోవైపు సత్యం సుందరం యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

News September 24, 2024

రేపు జమ్మూకశ్మీర్ రెండో విడత ఎన్నికలు

image

జమ్మూకశ్మీర్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 26 సీట్లలో పోలింగ్ జరగనుంది. ఇందులో కశ్మీర్‌లో 15, జమ్మూలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బుద్గాం, గందర్బాల్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. 24 స్థానాలకు జరిగిన మొదటి విడత ఎన్నికల్లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

News September 24, 2024

BSNL: రూ.997తో రీఛార్జ్ చేసుకుంటే..

image

జియో, AirTel లాంటి ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు ప్రభుత్వరంగ సంస్థ BSNL గట్టి పోటీ ఇస్తోంది. రూ.997తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 GB డేటా చొప్పున 160 రోజులకు 320 GB డేటా ఇస్తామని ట్వీట్ చేసింది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా అందిస్తున్నట్లు తెలిపింది.