News October 26, 2024

Wikipediaకు డబ్బులివ్వకండి: ఎలాన్ మస్క్

image

‘వికిపీడియా’కు ఫండింగ్ ఇవ్వొద్దని బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రజలను కోరారు. హార్డ్‌కోర్ లెఫ్టిస్టులు నియంత్రిస్తున్న ఆ ప్లాట్‌ఫామ్ మిస్‌యూజ్ అవుతోందని పేర్కొన్నారు. 40 మంది వికిపీడియా ఎడిటర్లు ఇజ్రాయెల్‌ను తప్పుపడుతూ, ర్యాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులకు మద్దతుగా కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారని US వెబ్‌సైట్ ‘పైరేట్ వైర్స్’ కథనం రాసింది. దానిని ఒకరు షేర్ చేయగా మస్క్ ఇలా స్పందించారు.

Similar News

News January 21, 2026

ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

image

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకోసారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.

News January 21, 2026

NASA నుంచి సునీతా విలియమ్స్ రిటైర్!

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(60) నాసా నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. తన కెరీర్‌లో 3 మిషన్లలో 608 రోజులు ఆమె స్పేస్‌లో గడిపారు. 62 గంటల 6 నిమిషాలు 9 స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్షంలో మారథాన్ పూర్తి చేసిన తొలి వ్యక్తి సునీత. 1998లో నాసాకు సెలక్టయిన ఆమె 27 ఏళ్లపాటు అందులో పని చేశారు. ఇటీవల 10 రోజుల మిషన్ కోసం వెళ్లి తొమ్మిదిన్నర నెలలపాటు <<15965407>>స్పేస్‌లో గడపడం<<>> తెలిసిందే.

News January 21, 2026

సీఎంల దావోస్ పర్యటన.. డబ్బు వృథానే: రాజీవ్ శుక్లా

image

సీఎంల దావోస్(Swiz) పర్యటనపై రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా అసహనం వ్యక్తం చేశారు. ‘భారతీయులు వెళ్లి భారతీయులనే కలుస్తున్నారు. దేశీయ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. భారత్‌లోనే ఈ అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు స్విట్జర్లాండ్ వెళ్లి అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఇదంతా డబ్బు వృథానే. అక్కడికి వెళ్లినప్పుడు విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే కాస్త ప్రయోజనకరం’ అని Xలో రాసుకొచ్చారు. దీనిపై మీ COMMENT?