News August 25, 2024

ప్రభుత్వంలో ఉన్నా వదలం: రేవంత్

image

TG: చెరువుల ఆక్రమణదారులను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ‘అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు. ప్రభుత్వంలోనూ ఉండొచ్చు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా కూల్చివేస్తాం. చెరువులు మన జీవనాధారం, సంస్కృతి. వాటిని కాపాడటం ఎంతో కీలకం. భవిష్యత్ తరాలకు వాటిని అందించాలి’ అని సీఎం ఆకాంక్షించారు.

Similar News

News March 7, 2026

నాలుగుసార్లు ప్రధాని.. చిత్తుగా ఓడిపోయారు

image

నేపాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఆ దేశానికి నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ(CPN-UML) సొంత నియోజకవర్గం జాఫా-5లో చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై RSP అభ్యర్థి బాలేంద్ర షా 49,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఓవరాల్‌గా 165 స్థానాలకుగాను RSP 67 చోట్ల గెలిచింది. 55 సెగ్మెంట్లలో లీడింగ్‌లో ఉంది. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్‌తో పోటీ పడుతున్నాయి.

News March 7, 2026

ఇకపై రైతుల అకౌంట్లకే సబ్సిడీ నిధులు: తుమ్మల

image

TG: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులు కొనుగోలు చేసిన పనిముట్లకు 40% సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తోంది. ఇకపై అన్నదాతల ఖాతాలకే ఆ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. APR నెలాఖరులోగా పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఖరీఫ్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించాలన్నారు. ఈసారి 60.60L హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News March 7, 2026

రాజమండ్రి కల్తీ పాలు.. మిస్టరీ వీడింది

image

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం <<19223408>>ఇథిలీన్ గ్లైకాల్<<>> అనే విషపూరిత కెమికల్ పాలలో కలిసినట్లు తెలిపారు. వీటిని తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతిని పలువురు <<19320294>>మరణించినట్లు<<>> వివరించారు. కాగా గత నెలలో పాలను నిల్వ చేసే ఫ్రీజర్‌ చెడిపోవడంతో అందులోని కూలెంట్ లీకయ్యింది. పాలు చేదుగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేసినా వ్యాపారి గణేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.