News October 18, 2024

హిందీ మాసోత్సవాలొద్దు: PMకి స్టాలిన్ లేఖ

image

హిందీ భాషకు మాసోత్సవాలు జరపడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు హిందీ మాసోత్సవాల్ని నిర్వహిస్తున్నారని పేర్కొంటూ PM మోదీకి లేఖ రాశారు. ‘రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ భాష హోదా ఇవ్వలేదు. హిందీ భాషేతర రాష్ట్రాల్లో హిందీ మాసోత్సవాల నిర్వహణ సరికాదు. ఒకవేళ అలా నిర్వహించాలంటే ఆయా రాష్ట్రాల భాషలకూ ఉత్సవాలు చేయాలనేది నా సూచన’ అని పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్‌న్యూస్

image

TG: 60 చదరపు గజాల కంటే తక్కువ స్థలం ఉంటే జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాలవారికి ఈ ఆప్షన్ ఇచ్చింది. రెండు గదులతో పాటు కిచెన్, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలో రెండు విడతల్లో రూ.లక్ష చొప్పున, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో ఒకసారి రూ.2లక్షలు, చివరి విడతగా మరో రూ.లక్ష చెల్లించనున్నట్లు వెల్లడించింది.

News October 22, 2025

3 సార్లు ఫోన్ చేసినా జగన్ నంబర్ పని చేయలేదు: సీబీఐ

image

YCP చీఫ్ జగన్ లండన్ పర్యటనకు సంబంధించి <<18018569>>సీబీఐ పిటిషన్‌<<>>పై వాదనలు పూర్తయ్యాయి. జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు 3సార్లు ఫోన్ చేసినా ఆయన ఇచ్చిన నంబర్ పని చేయలేదని CBI వాదనలు వినిపించింది. ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నంబర్ ఇచ్చారంది. మరోసారి జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. జగన్, CBI తరఫు వాదనలు విన్న CBI కోర్టు తీర్పును ఈ నెల 28న వెల్లడిస్తానని పేర్కొంది.

News October 22, 2025

రేపటి మ్యాచ్‌కు వర్షం ముప్పుందా?

image

రేపు భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే జరిగే అడిలైడ్‌లో వర్షం ముప్పు 20% ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అయితే మ్యాచ్‌కు అంతరాయం కలిగించకపోవచ్చని పేర్కొంది. దీంతో 50 ఓవర్ల ఆట జరగనుంది. ఇక తొలి వన్డేకు వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఇందులో AUS 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌‌లో నిలవాలంటే రేపటి మ్యాచులో తప్పక గెలవాలి.