News September 18, 2024
జానీ మాస్టర్పై వేటు

అసిస్టెంట్ డాన్సర్పై అత్యాచార ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది. డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనను తాత్కాలికంగా తొలగిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
Similar News
News November 15, 2025
భూకంపాలను పసిగట్టే ప్రాచీన భారత టెక్నాలజీ

భూకంపాలను గుర్తించే సాంకేతికత ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి సవాలే. కానీ, వేల ఏళ్ల క్రితమే మన భారతీయ శాస్త్రాలు భూకంపాల పూర్వ సూచనలను చెప్పే గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాయి. సుమారు 1,500 సంవత్సరాల క్రితం వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత అనే గ్రంథంలో, భూకంపాలకు ముందు ప్రకృతిలో వచ్చే అసాధారణ వాతావరణ మార్పులను (పశుపక్ష్యాదుల ప్రవర్తన, భూగర్భ జలాల్లో మార్పులు) క్షుణ్ణంగా వివరించారు. <<-se>>#VedikVibes<<>>
News November 15, 2025
CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు: రాష్ట్ర ప్రభుత్వం

AP: సీఐఐ సదస్సులో తొలి రోజు 365 సంస్థలతో రూ.8,26,668 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమ్మిట్ ముందు రోజుతో కలిపి 400 MoUలు, రూ.11,99,971 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది. దీంతో 13,32,445 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న విశ్వాసాన్ని మరోసారి రుజువుచేసిందని తెలిపింది.
News November 15, 2025
కలియుగ ధర్మ సూత్రమిదే..

ఈ కలియుగంలో నీ గతం ఎంత గొప్పదైనా నీవు చేసిన ఒక్క తప్పును జనం చెడుగానే పరిగణిస్తారు. వంద మంచి పనులు చేసినా, ఒక చిన్న లోపం కనిపిస్తే, లోకం నిన్ను చెడ్డవానిగా ముద్రవేస్తుంది. అదేవిధంగా నీ గతం ఎంత చెడ్డదైనా, చిత్తశుద్ధితో చేసిన ఒక్క మంచి పని అయినా నిన్ను మంచివానిగా నిలబెట్టగలదు. అందుకే జనాభా అభిప్రాయాలకు లొంగకుండా, వర్తమానంలో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన జీవిత నిబంధనగా ముందుకు సాగాలి.


