News July 10, 2024
లోన్ యాప్స్ జోలికి వెళ్లకండి: పోలీసులు

TG: లోన్ యాప్స్ వేధింపులతో ఓ వ్యక్తి కిడ్నీ అమ్మేందుకు యత్నించిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వాటి జోలికి వెళ్లొద్దని అవగాహన కల్పిస్తున్నారు. ‘లోన్ యాప్స్ ద్వారా అప్పు చేసి అవసరాలు తీర్చుకోవటం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేస్తుంది. కానీ ఆ తర్వాత మన పాలిట శాపంగా పరిణమిస్తుంది. లోన్ యాప్ అప్పులు మన జీవితాల్ని అంధకారంలోకి నెడతాయి. తస్మాత్ జాగ్రత్త!’ అని Xలో పోస్ట్ చేశారు.
Similar News
News November 29, 2025
అప్పటికల్లా నక్సలిజం అంతం: అమిత్ షా

దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. రాయ్‌పూర్‌లో జరిగిన DGP, IGP సదస్సులో మాట్లాడారు. తదుపరి కాన్ఫరెన్స్ జరిగే నాటికి ముందే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఏడేళ్లుగా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2014లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు 126 ఉండగా, ప్రస్తుతం 11కి తగ్గినట్లు వెల్లడించారు.
News November 29, 2025
పేదల కోసం అర్ధరాత్రి వరకూ ఉంటా: CJI

తన కోర్టులో లగ్జరీ వ్యాజ్యాలకు చోటుండదని.. పేద కక్షిదారులే తన తొలి ప్రాధాన్యత అని CJI సూర్యకాంత్ స్పష్టంచేశారు. తిలక్ సింగ్ డాంగీ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన తర్వాత ఆయన స్పందిస్తూ.. “చివరి వరుసలో ఉన్న పేదవారి కోసం నేను ఇక్కడ ఉన్నాను. అవసరమైతే అర్ధరాత్రి వరకూ కోర్టులో కూర్చుంటాను” అని అన్నారు. సంపన్నులు వేసే అనవసర కేసులకు సమయం వృథా చేయబోనని వ్యాఖ్యానించారు.
News November 29, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్(81) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో కాన్పూర్‌లో తుదిశ్వాస విడిచారు. ఈయన 2004-2009 వరకు హోంశాఖ సహాయ మంత్రిగా, 2011-2014 మధ్య కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి కావడానికి ముందు 2000-2002 వరకు ఈయన UPCC అధ్యక్షుడిగా సేవలందించారు. శ్రీప్రకాశ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్ర నేతలు సంతాపం తెలిపారు.


