News October 21, 2024
3 నిమిషాలకు మించి హగ్ చేసుకోవద్దు: ఎయిర్‌పోర్టు

న్యూజిలాండ్‌లోని డునెడిన్ ఎయిర్‌పోర్టు ఆసక్తికర నిబంధన తీసుకొచ్చింది. సెండాఫ్ ప్రాంతంలో 3 నిమిషాలకు మించి హగ్ చేసుకోకూడదని కండీషన్ పెట్టింది. మరీ బెంగగా ఉన్నవారు కారు పార్కింగ్‌లోనే కౌగిలింతలు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, కానీ ఒక హగ్‌కు 20 సెకన్ల వ్యవధి చాలని ఎయిర్ పోర్ట్ సీఈఓ డేనియెల్ డి బోనో స్పష్టం చేశారు.
Similar News
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (1/2)

మనిషి స్పేస్ జర్నీ ఈజీ చేసేందుకు మనకంటే ముందు కొన్ని ప్రాణులు స్పేస్‌లోకి వెళ్లాయి. 1947లో USA సైంటిస్ట్స్ ఫ్రూట్ ఫ్లైస్(ఓ జాతి ఈగ)ను పంపారు. రేడియేషన్, జీవక్రియ, ప్రత్యుత్పత్తి తదితరాలపై రీసెర్చ్ కోసం పంపిన అవి తిరిగొచ్చాయి. 1949లో కోతిని పంపగా పారాచూట్ ఫెయిలై వెనక్కి రాలేదు. 1957లో స్పుత్నిక్2లో వీధి కుక్క లైకాను రష్యా పంపింది. భూ కక్ష్యలో అడుగుపెట్టిన తొలి జంతువు ఆ వెదర్‌లో కొంతసేపే బతికింది.
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (2/2)

1960లో స్పుత్నిక్5తో వెళ్లిన డాగ్స్ బెల్కా, స్ట్రెల్కా తిరిగొచ్చాయి. మనుషులు స్పేస్ జర్నీ చేయగలరని వీటితోనే తెలిసింది. 1961లో నాసా ఓ చింపాంజీని పంపి మెదడు పనితీరు పరిశీలించింది. నరాల పనితీరుపై అధ్యయనం కోసం France 1963లో పిల్లిని, 2007లో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వాటర్ బేర్‌ను పంపింది. స్పేస్‌లో ఆక్సిజన్ కొరత, రేడియేషన్‌ను ఇవి తట్టుకున్నాయి.
-1961: యూరి గగారిన్ స్పేస్‌లోకి వెళ్లిన తొలి మనిషి
News December 1, 2025
తగ్గుతున్న GST ఆదాయ వృద్ధి!

TG: రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. NOVలో ₹3910 కోట్ల GST వసూలైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024 NOVలో వచ్చిన ₹3880 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు 1% పెరిగింది. అయితే అయితే ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే నెలనెలా పెరగాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. GST-2.O అమలు చేసినప్పటి తరువాత నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు.


