News October 10, 2024

సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించం: మంత్రి కొల్లు

image

ఏపీలో మద్యం షాపులను సొంతం చేసుకోవడానికి కొందరు సిండికేట్లుగా ఏర్పడుతున్నారనే ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వొద్దని, రాజకీయ ఒత్తిళ్లు తలొగ్గొద్దని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ, షాపుల కేటాయింపులు పారదర్శకంగా ఉండాలన్నారు. సిండికేట్లకు సహకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నెల 16నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.

Similar News

News October 10, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.
TG: HYD, ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, సిరిసిల్ల, KNR, కొత్తగూడెం, KMM, NLG, సూర్యాపేట, సిద్దిపేట, RR, మేడ్చల్, VKB, సంగారెడ్డి, MDK, కామారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల.
AP: అల్లూరి, NTR, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి.

News October 10, 2024

రతన్ టాటాకు ఏపీ క్యాబినెట్ సంతాపం

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం మౌనం పాటించి రతన్ టాటాకు నివాళి అర్పించింది. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం కొనియాడారు. అనంతరం క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు, లోకేశ్ ముంబై వెళ్లి రతన్ టాటా భౌతికకాయానికి నివాళి అర్పించనున్నారు.

News October 10, 2024

ఇవి కూడా గర్భనిరోధక మార్గాలే

image

గర్భనిరోధక మార్గాల్లో ఎక్కువమందికి తెలిసింది కండోమ్‌లే. అయితే మరిన్ని సులువైన మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్యాండ్ ఎయిడ్ తరహాలో అత్యంత సులువుగా చేతికి అంటించుకునేవి కూడా వీటిలో ఉన్నాయి. ఇది హార్మోన్లను నియంత్రించడం ద్వారా గర్భం దాల్చకుండా చేస్తుంది. ఇక సెర్వికల్ క్యాప్, వెజైనల్ రింగ్, IUD, పిల్స్ వంటివి కూడా గర్భనిరోధకాలుగా పనికొస్తాయని వివరిస్తున్నారు.