News November 8, 2024
తన స్నేహితుడిలా మరెవరికీ జరగొద్దని..!
దేశంలో ఏటా 1.50లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీరిలో ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతోనే చాలామంది మరణిస్తున్నారు. అలా చనిపోయిన వారిలో దినేశ్ ఒకరు. తన మిత్రుడిలా ఎవరూ చనిపోవద్దని వివేక్ అనే వ్యక్తి ఓ పరికరం కనుగొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటో మెటిక్గా ట్రిగ్గర్ అయ్యే రక్షణ వ్యవస్థను తయారు చేశారు. ఇది ప్రమాద లోకేషన్ ఆధారంగా ఎమర్జెన్సీ సేవలకు సమాచారం ఇస్తుంది. ఇదంతా 3ని.లలోపే జరుగుతుంది.
Similar News
News November 8, 2024
నా పోరాటం కొనసాగిస్తా: కేఏ పాల్
AP: తిరుమలను <<14559672>>కేంద్ర పాలిత ప్రాంతం<<>> చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై KA పాల్ స్పందించారు. ‘తిరుమల వ్యవహారంపై నా పోరాటం ఆపను. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. తిరుమలలో గొడవలు ఆగాలంటే కేంద్రం పాలిత ప్రాంతం చేయాల్సిందే. నా పిటిషన్ను విచారించిన ధర్మాసనానికి కృతజ్ఞతలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News November 8, 2024
‘పుష్ప-2’: స్పెషల్ సాంగ్లో శ్రీలీలతో పాటు మరో బ్యూటీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమాలోని స్పెషల్ సాంగ్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్లో నటిస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, సమంత సైతం అతిథిగా సాంగ్లో కనిపించాల్సి ఉందని, కానీ ఆమె ప్లేస్లో ఓ బాలీవుడ్ నటికి ఛాన్స్ వచ్చిందని వెల్లడించాయి. కాగా సాంగ్ షూట్తో సినిమా షూటింగ్ పూర్తికానుండగా DEC 5న మూవీ విడుదల కానుంది.
News November 8, 2024
మ్యూజిక్ డైరెక్టర్ స్థలం కబ్జా: ప్రభుత్వం స్వాధీనం
TG: సంగీత దర్శకుడు చక్రవర్తికి ఎన్టీఆర్ హయాంలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నం.14లో 20 గుంటల స్థలం కేటాయించారు. ఈ స్థలంలో చక్రవర్తి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆయన కుమారుడు కూడా ఈ స్థలాన్ని గాలికొదిలేశారు. దీంతో 40 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న రూ.65 కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. విషయం తెలుసుకున్న షేక్ పేట్ రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.