News August 24, 2025

యూరియా, ఎరువులు పక్కదారి పట్టొద్దు: CBN

image

AP: ఎరువుల ధరలు పెంచి అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలన్నారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్‌ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిలెన్స్ ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. యూరియా, ఎరువులు పక్కదారి పట్టకుండా స్టాక్ చెకింగ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News August 25, 2025

కిషన్‌రెడ్డి వాస్తవాలను దాస్తున్నారు: తుమ్మల

image

TG: యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను మంత్రి తుమ్మల ఖండించారు. ‘11 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందో మీకు తెలియదా? దిగుమతులు, దేశీయంగా సరిపడా ఉత్పత్తి లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాస్తున్నారు. కేంద్రం TGకి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. కానీ 5.66 లక్షల మె.టన్నులే సరఫరా చేసింది’ అని స్పష్టం చేశారు.

News August 25, 2025

రేపు కాల్ లెటర్స్ విడుదల: డీఎస్సీ కన్వీనర్

image

AP: మెగా <<17508409>>డీఎస్సీ<<>> మెరిట్ అభ్యర్థులకు రేపు కాల్ లెటర్స్ అందుతాయని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యాశాఖ అధికారులతో పాటు రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగితో కలిపి ముగ్గురు ఒక టీమ్‌గా ఉంటారని పేర్కొన్నారు. కాగా ధ్రువపత్రాల పరిశీలన ఎల్లుండి నుంచి మొదలు కానుంది.

News August 25, 2025

DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మార్పు

image

AP: 16,347 DSC పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మారినట్లు మెగా DSC కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తొలుత సోమవారం వెరిఫికేషన్ నిర్వహించాలని భావించినా పలు కారణాలతో మంగళ, బుధవారాల్లో చేపట్టనున్నట్లు వివరించారు. ఆన్‌లైన్ అప్లికేషన్లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత క్రమంలోనే CV నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 22న మెరిట్ లిస్ట్ రిలీజైన విషయం తెలిసిందే.