News December 4, 2024

కర్పూరం వెలిగించవద్దు, హారతి ఇవ్వొద్దు: అయ్యప్పలకు రైల్వే సూచన

image

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి రైళ్లలో వెళ్లే మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైలు కోచ్‌లలో కర్పూరం, అగరబత్తి వెలిగించడం, హారతి ఇవ్వడం చేయవద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే యాక్ట్ 67, 154, 164, 165 సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ చర్యలతో రైలులో అగ్నిప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వివరించింది.

Similar News

News December 5, 2025

లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్

image

* నటి, బిగ్‌బాస్ తెలుగు-3 కంటెస్టెంట్ పునర్నవి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. తన ప్రియుడు హేమంత్ వర్మ(ఫొటోగ్రాఫర్) కశ్మీర్‌లో చేసిన ప్రపోజల్‌కు ఓకే చెప్పినట్లు ఆమె ఇన్‌స్టాలో ఫొటోలు పంచుకున్నారు.
* సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి ‘షో మ్యాన్’ టైటిల్‌ ఫిక్స్ చేయగా దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సుమన్ విలన్‌గా నటించనున్నారు.

News December 5, 2025

నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

image

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 5, 2025

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

image

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.