News November 29, 2024
ఉదయం లేవగానే వీటిని చూడొద్దు!

వాస్తు శాస్త్ర ప్రకారం ఉదయం లేవగానే కొన్ని రకాల వస్తువులు చూడకూడదు.
*అద్దంలో ముఖం చూసుకోవడం, జుట్టు దువ్వడం చేయకూడదు.
*పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలు చూడొద్దు.
*రాత్రిపూట వదిలేసిన ఎంగిలి గిన్నెలను చూడకూడదు. రాత్రికే వాటిని శుభ్రం చేసుకోవాలి.
*అడవి జంతువులు, యుద్ధం, హింసకు సంబంధించిన పెయింటింగ్, ఫొటోలు చూడొద్దు.
>వీటిని చూస్తే నెగటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Similar News
News December 3, 2025
విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు

AP: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో ఈ నెల 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐటీ పార్కులోని తాత్కాలిక భవనంలో తన సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2028 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయని సమాచారం.
News December 3, 2025
పెళ్లి కాని వారు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చా?

పెళ్లికాని వారు కూడా సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో చేసే ఈ వ్రతానికి అధిక ఫలితం ఉంటుందని అంటున్నారు. ‘ఈ వ్రతాన్ని ఇంట్లోనే కాకుండా ఆలయాలు, నదీ తీరాలు, సాగర సంగమాల వద్ద కూడా చేసుకోవచ్చు. స్వామివారి కథ విన్నా కూడా శుభం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు, సూతకం వంటివి ఉన్నప్పుడు వ్రతాన్ని చేయకపోవడం మంచిది’ అంటున్నారు.
News December 3, 2025
763 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్(CEPTAM) 763 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. వెబ్సైట్: https://www.drdo.gov.in


