News May 25, 2024

హేమపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: మంచు విష్ణు

image

రేవ్ పార్టీలో డ్రగ్స్‌కు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు నటి హేమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించాలి. ఆమె ఇమేజ్‌ను దెబ్బ తీయడం అన్యాయం. పోలీసులు కచ్చితమైన సాక్ష్యాలను అందజేస్తే ఆమెపై ‘మా’ తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటివరకు నిరాధారమైన వార్తలను ప్రసారం చేయకండి’ అని కోరారు.

Similar News

News December 2, 2025

నెల్లూరు జిల్లాకు ఏమైంది……?

image

ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏమైంది. ఒకవైపు గూడూరు ప్రజలేమో నెల్లూరులో తమ నియోజకవర్గాన్ని కలపాలని నిరసనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నెల్లూరులో లేడీ డాన్లు గంజాయి ముఠాతో హత్యలు చేయిస్తున్నారు. గతంలో ఇదే గడ్డ మీద ఎందరో మహానుభావులు హుందాగా రాజకీయాలు చేశారు. అలాంటి నెల్లూరు జిల్లా గడ్డ మీద నేడు ఈ పరిస్థితులు చూస్తున్నావారు నెల్లూరు జిల్లాకు ఏమైంది అంటూ ఆలోచనలో పడ్డారు.

టెస్లా కార్లపై ఆసక్తి చూపని భారతీయులు!

image

భారతీయ మార్కెట్‌లో టెస్లా కార్లకు ఆశించిన స్థాయిలో స్పందన లభించట్లేదు. OCTలో 40, NOVలో 48 కార్లే అమ్ముడయ్యాయి. JULY నుంచి ఇప్పటి వరకు మొత్తం 157 కార్లనే విక్రయించింది. అధిక ధరలు, విపరీతమైన పోటీ కారణంగా ఇండియన్స్ ఆసక్తి చూపట్లేదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్ల కొరత కూడా అమ్మకాలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు. కాగా మోడల్ Y ధర రూ.60లక్షలకు పైగా ఉంది.