News June 15, 2024
అధికారం ఉందని కక్ష సాధింపులు చేయవద్దు: చంద్రబాబు

AP: కూటమి విజయం కోసం కష్టపడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘ఎవరు, ఎక్కడ ఏం చేశారో చూసి పదవులు ఇస్తాం. నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయి. అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దు. బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారు’ అని పార్టీ కార్యకర్తలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్లో వెల్లడించారు.
Similar News
News November 25, 2025
బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు!

TG: గతంలో పంచాయతీ ఎన్నికల వెంటనే పరిషత్ ఎన్నికలు (MPTC, ZPTC) జరిగేవి. కానీ, ఈసారి పరిషత్ ఎన్నికలను కొంత ఆలస్యంగా నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడంతో ముందుగా సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే అంశం తేలాక పరిషత్ ఎన్నికలు నిర్వహించనుంది.
News November 25, 2025
12,735లో బీసీలకు 2,176 గ్రామ పంచాయతీలే!

TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన 17.08% రిజర్వేషన్లు అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో BCలకు 20% రిజర్వేషన్లు దక్కినా ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. అటు BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు.
News November 25, 2025
T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ICC రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్ FEB 7న పాక్-నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది. అదే రోజు టీమ్ ఇండియా ముంబై వేదికగా USAతో తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. IND, PAK, USA, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. మార్చి 8న ఫైనల్ జరగనుంది.


