News December 9, 2024
నేను చేసిన తప్పు మీరు చేయొద్దు: రకుల్ ప్రీత్

కొన్ని రోజుల క్రితం వర్కౌట్ చేస్తూ గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిమితికి మించి వర్కౌట్లు చేసి తప్పు చేశానని, ఆ తప్పు ఇంకెవ్వరూ చేయొద్దని కోరారు. గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ బ్యూటీ కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.
Similar News
News December 21, 2025
స్లీవ్లెస్, చిరిగిన దుస్తులతో ఆఫీసుకు రావొద్దు!

హుందాగా ఉండే డ్రెస్సులతోనే ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతమంది సిబ్బంది అసభ్యకరంగా దుస్తులు ధరించారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపింది. ‘ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేదు. కానీ కొందరు కాలేజీ యువత మాదిరి చిరిగిన జీన్స్, స్లీవ్లెస్, బిగుతైన దుస్తులు ధరిస్తున్నారు. ఇది సరికాదు. విధి నిర్వహణలో హుందాగా ఉండాలి’ అని DPAR విభాగం ఉత్తర్వులిచ్చింది.
News December 21, 2025
ఘన జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

☛ దేశీ ఆవుపేడ 100kgలు ☛ దేశీ ఆవు మూత్రం 5లీటర్లు ☛ బెల్లం 2kgలు ☛ పప్పు దినుసుల పిండి 2kgలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) ☛ గుప్పెడు పుట్టమట్టి
తయారీ: ఈ పదార్థాలను 100KGలు బాగా చివికిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి గోనెపట్టా కప్పాలి. 48 గంటల తర్వాత పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది.
News December 21, 2025
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే?

ఎంత కష్టపడి సంపాదించినా కొందరి చేతిలో డబ్బు నిలవదు. శుక్ర, గురు గ్రహ అనుగ్రహం తక్కువగా ఉండటం వల్ల అలా జరుగుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవి పూజ, కనకధారా స్తోత్ర పఠనం చేయాలని సూచిస్తున్నారు. ఇంటి ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. ఈ పరిహారాలు పాటిస్తే ఆర్థిక స్థితిని మెరుగుపడి అప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందట.


