News January 1, 2025

న్యూ ఇయర్‌లో ఈ తప్పులు చేయకండి!

image

☛ ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు
☛ ఉన్న అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు తీసుకోవద్దు
☛ ఇతరులతో పోల్చుకుంటూ స్థాయికి మించి కార్లు, ఫ్లాట్లు వంటివి కొనుగోలు చేయవద్దు
☛ ఆదాయం పెంచుకునేందుకు, ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి
☛ ఆరోగ్య, జీవిత బీమా తీసుకోవాలి. ఎందుకులే అని నిర్లక్ష్యం చేయవద్దు
☛ ఒక్క ఏడాదిలోనే లక్షాధికారులు అయిపోరనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రణాళిక బద్ధంగా పొదుపు, మదుపు చేయాలి.

Similar News

News January 4, 2025

హోంమంత్రి అనిత పీఏపై వేటు!

image

AP: తన పీఏ సంధు జగదీశ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో హోంమంత్రి వంగలపూడి అనిత అతడిని విధుల నుంచి తొలగించారు. ఆయన పదేళ్లుగా మంత్రి వద్ద పనిచేస్తున్నారు. మంత్రి పేరు చెప్పి జగదీశ్ అక్రమ వసూళ్లకు తెరతీశారని, పార్టీ నాయకులతో దురుసుగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణ, తిరుమల సిఫార్సు లేఖలు, మద్యం దుకాణాల్లో వాటాలవంటి పలు అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.

News January 4, 2025

విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

image

AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఓ సారి ఈడీ నోటీసులు ఇవ్వగా, అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఆయన హాజరుకాలేదు. తాజా నోటీసుల నేపథ్యంలో VSR విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. కాకినాడ పోర్టులో కేవీ రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

News January 4, 2025

ఆసీస్ ఆలౌట్

image

సిడ్నీలో జరుగుతున్న BGT ఐదో టెస్టులో ఆసీస్ 181 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 185 రన్స్ చేయగా ఆస్ట్రేలియా 4 రన్స్ వెనుకంజలో నిలిచింది. టీమ్ఇండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్ 3, బుమ్రా 2, నితీశ్ రెడ్డి 2 వికెట్లు తీశారు. ఆసీస్ జట్టులో డెబ్యుటంట్ వెబ్‌స్టర్ 57 పరుగులు, స్మిత్ 33 పరుగులతో రాణించారు. ఇవాళ మరో 40 ఓవర్లు ఆట జరిగే ఛాన్స్ ఉంది.