News October 26, 2024
రెండు రోజులు ఎవ్వరినీ కలవను: జానీ మాస్టర్

చంచల్గూడ జైలు నుంచి విడుదలైన <<14447920>>జానీ మాస్టర్<<>> తన ఇంట్లో ఓ డైరెక్టర్, ఇద్దరు కొరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ‘జైలులో పెట్టే ఆహారం తినలేకపోయా. మనిషి అనే వాడు జైలుకు వెళ్లకూడదు. బయట కంటే జైలులో నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తా. అప్పటి వరకూ ఎవరితో మాట్లాడను. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా’ అని చెప్పినట్లు సమాచారం.
Similar News
News November 22, 2025
యాపిల్ ఎయిర్డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్డ్రాప్ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.


