News April 18, 2024
ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించి ప్రస్తావించొద్దు: కోర్టు

AP: ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మాట్లాడకూడదని కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య గురించి ప్రస్తావించొద్దని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, పురందీశ్వరి, బీటెక్ రవి, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతను ఆదేశించింది.
Similar News
News January 11, 2026
టెట్ నుంచి ఆ టీచర్లకు ఊరట?

సుప్రీంకోర్టు <<17587484>>తీర్పు<<>> నేపథ్యంలో టీచర్లు కూడా టెట్ రాస్తున్న విషయం తెలిసిందే. అయితే పరీక్ష సిలబస్‌లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ఉండటంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో 2011 ముందు నియమితులైన టీచర్లకు మినహాయింపునివ్వడంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అడిగినట్లు సమాచారం. కేంద్రం నిర్ణయంతో 12 లక్షల మందికి పైగా టీచర్లకు ఊరట దక్కే అవకాశం ఉంది.
News January 11, 2026
సర్వీస్ ఛార్జ్ వేస్తే రెస్టారెంట్లపై ఫిర్యాదు చేయండి

రెస్టారెంట్స్/బార్స్ కస్టమర్‌కు డీఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్‌తో బిల్ ఇవ్వడం నేరం. వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం.. SCతో బిల్ ఇవ్వడం, మరో పేరుతో ఛార్జ్, తప్పక ఇవ్వాలనడం తదితరాలు చట్ట విరుద్ధం. సేవలు నచ్చి కస్టమర్ స్వతహాగా ఇస్తే తీసుకోవచ్చు కానీ డిమాండ్ చేయకూడదు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ 1915కు ఫిర్యాదు చేస్తే, విచారించి రెస్టారెంట్లకు ₹50K వరకు ఫైన్ విధిస్తుంది.
Share It
News January 11, 2026
T20 WC: బంగ్లా మ్యాచుల నిర్వహణకు పాక్ రెడీ!

భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో T20 WC మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ <<18761652>>నిరాకరించిన<<>> విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. ఈ క్రమంలో శ్రీలంకలో బంగ్లా మ్యాచులు సాధ్యం కాకపోతే తమ దేశంలో జరిపేందుకు సిద్ధమని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని గ్రౌండ్లు రెడీగా ఉన్నాయని అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. కాగా బంగ్లా రిక్వెస్ట్‌పై ఇంకా ఐసీసీ నిర్ణయం తీసుకోలేదు.


