News February 28, 2026
Don’t miss: నేడు బాలికలకు ఫ్రీగా HPV టీకా

సర్వైకల్ క్యాన్సర్ కేసుల కట్టడే లక్ష్యంగా ఇవాళ 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్ జరగనుంది. PM మోదీ రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో జాతీయస్థాయి టీకా కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. APలో CM CBN రావివలస(విజయనగరం)లో, TGలో మంత్రి రాజనర్సింహ HYD కోఠిలో ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6.75L మందికి పంపిణీ చేస్తారు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.
#ShareIt
Similar News
News February 28, 2026
అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త

TG: హైదరాబాద్ నుంచి అరుణాచలం(తిరువణ్ణామలై)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. నాంపల్లి-కన్యాకుమారి(07229/07230) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెగ్యులర్(17069/17070) సర్వీస్‌గా నడపనున్నట్లు తెలిపింది. అలాగే కాచిగూడ-మధురై వీక్లీ ఎక్స్‌ప్రెస్(17615/17616)ను కూడా రోజూ నడుపుతామని పేర్కొంది. దీన్ని తూత్తుకుడి వరకు పొడిగించింది.
News February 28, 2026
7 మ్యాచుల్లో 4 POTM అవార్డులు

T20WC-2026లో ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఇంగ్లండ్‌కు వరంలా మారారు. అతడు 7 మ్యాచుల్లో 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. 176 స్ట్రైక్ రేట్‌తో 191 రన్స్ చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టారు. కీలక సమయాల్లో రాణిస్తూ ఒంటిచేత్తో జట్టును గెలిపిస్తున్నారు. నిన్న NZపై సైతం చివరి ఓవర్లలో సిక్సర్లు, బౌండరీలతో మ్యాచును మలుపుతిప్పారు.
News February 28, 2026
252 ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

CSC ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ 252 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో TGలో 10, APలో 7 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in


