News January 6, 2025
Don’t Miss: 2 రోజులే ఛాన్స్

SBIలో 13,735 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి జనవరి 7తో గడువు ముగియనుంది. తెలంగాణలో 342, ఏపీలో 50 ఖాళీలున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు ఫైనలియర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. బేసిక్ పే నెలకు రూ.26,730. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు ఫీజు లేదు. <
Similar News
News January 19, 2026
మన్యంకొండ ఆలయ హుండీ ఆదాయం రూ.35.77 లక్షలు

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.35,77,912 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
News January 19, 2026
ఇండియన్ క్రికెట్లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
News January 19, 2026
ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించిన రిజర్వేషన్ల సమాచారాన్ని SEC వెబ్సైట్లో పొందుపరిచింది. నిన్న మేడారంలో జరిగిన క్యాబినెట్ భేటీలో మున్సి‘పోల్స్’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. FEB 14 నుంచి ఈ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇపుడు SEC రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని స్పష్టమవుతోంది.


