News May 19, 2024
ఎలాంటి అవకాశాన్ని వదులుకోము: మోదీ

లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాము చేస్తున్నది దేశాన్ని 1000 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తువైపు తీసుకెళ్తుందని చెప్పారు. ఆ విషయంలో తాను స్పష్టంగా ఉన్నానని తెలిపారు. ఇది భారత్ సమయమని.. ఎలాంటి అవకాశాన్ని తాము వదులుకోమని పేర్కొన్నారు. పక్కాగా ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయన్నారు.
Similar News
News November 27, 2025
గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఫిర్యాదులకు ఆన్లైన్ పోర్టల్

గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వివిధ అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని ఇంచార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. ఓటర్ల జాబితా, నామినేషన్లు, ఓట్ల లెక్కింపు ఇతర అంశాలపై కింద ఇచ్చిన ఆన్లైన్ పోర్టల్ https://grievance.tsec.gov.in/home ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
News November 26, 2025
రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: CM

AP: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం జరగాలని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని CRDA సమీక్షలో సూచించారు. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని, నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.
News November 26, 2025
భట్టి కుమారుడి ఎంగేజ్మెంట్.. హాజరైన సీఎం

TG: హైదరాబాద్లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.


