News June 23, 2024
ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది: రవితేజ

‘ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకి తప్ప’ అంటూ టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ట్విటర్లో రవితేజ ఫొటోను పోస్ట్ చేశారు. దీనికి ‘ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది’ అని మాస్ మహరాజా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కశ్మీర్ లోయలో అద్భుతంగా షూటింగ్ చేశాం. త్వరలో HYDలో ల్యాండ్ అవుతాం’ అని హరీశ్ శంకర్ తెలిపారు.
Similar News
News December 19, 2025
మూడు నెలల్లో ఒకే గ్రామంలో 27వేల జననాలు.. తీరా చూస్తే!

MH యావత్మల్(D) శేందుర్సనీ GPలో గత మూడు నెలల వ్యవధిలో ఏకంగా 27,397 జననాలు నమోదవ్వడం కలకలం రేపింది. 1,500 మంది ఉండే ఈ గ్రామంలో ఈ సంఖ్యలో జననాలు ఉండటం సైబర్ కుట్రగా అధికారులు భావిస్తున్నారు. వీటిలో 99శాతం ఎంట్రీలు వెస్ట్ బెంగాల్, UP నుంచే ఉన్నాయని BJP నేత కిరీట్ సోమయ్య అన్నారు. ఈ విషయంపై CMతో మాట్లాడి బర్త్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కాగా దీనిపై కేసు నమోదైంది.
News December 19, 2025
e-KYC లేకపోయినా బియ్యం పంపిణీ: పౌరసరఫరాల శాఖ

TG: రేషన్కార్డుదారులు ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. e-KYC తప్పనిసరి అని, అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు. బియ్యం పంపిణీని ఆపబోమని స్పష్టం చేశారు. కార్డులో పేరు ఉన్నవారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు, ఐరిష్ ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు.
News December 18, 2025
మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీని ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’తో ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సత్కరించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA)పై చర్చలు జరిపారు. ప్రస్తుతం భారత్-ఒమన్ మధ్య 12 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతోంది.


