News April 14, 2025

నిప్పుతో చెలగాటమాడద్దు.. హసీనా వార్నింగ్

image

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం నిర్మించిన ముక్తి జోధా కాంప్లెక్స్‌‌లను దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ తొలగిస్తున్నారని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. ‘నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్నే దహించివేస్తుందని’ అని హెచ్చరించారు. యూనస్ విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశ పతనానికి యత్నించారని ఆరోపించారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా బంగ్లాకు వెళ్తానని ఇటీవల ప్రతిజ్ఞ చేశారు.

Similar News

News March 18, 2026

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా?

image

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇటీవల ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరిగింది. అయితే ఈ స్టవ్‌లను ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయొద్దని పలు కంపెనీలు సూచిస్తున్నాయి. వంట పూర్తయ్యాక కొంత సేపు స్టాండ్ బై మోడ్‌లో ఉంచాలంటున్నాయి. ఇలా చేస్తే స్టవ్‌లో ఉన్న కూలింగ్ ఫ్యాన్ లోపలి భాగాల వేడిని తగ్గిస్తుందని చెబుతున్నాయి. వెంటనే ఆఫ్ చేస్తే స్టవ్‌లోని సున్నితమైన భాగాలు ఎక్కువసేపు వేడిగా ఉండి పనితీరు తగ్గుతుందంటున్నాయి.

News March 18, 2026

మూసీ ప్రక్షాళనను BRS అడ్డుకుంటోంది: భట్టి

image

TG: మూసీ ప్రక్షాళనను BRS వ్యతిరేకిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో విమర్శించారు. పునరుజ్జీవనంపై ఆ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్‌మెంట్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. కానీ వారి జీవితాలు బాగుపడకుండా మురికి కూపంలోనే ఉండాలని BRS కోరుకుంటోందని భట్టి మండిపడ్డారు.

News March 18, 2026

లెక్క లెక్కే.. బుమ్రాకు న్యాయం చేసేలా BCCI ప్లాన్స్

image

కోహ్లీ, రోహిత్, జడేజా, బుమ్రా A+ కేటగిరీలో ₹7 కోట్లు అందుకునేవారు. రోహిత్, కోహ్లీ ఒకే ఫార్మాట్ ఆడుతుండటం, జడేజా T20Iల నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం బుమ్రా ఒక్కరే 3 ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. దీంతో A+ కేటగిరీని తొలగించి అందరినీ A గ్రేడ్‌కు మార్చడంతో ఆయనకు ₹2 కోట్ల నష్టం జరుగుతోంది. దీన్ని భర్తీ చేసేందుకు BCCI కాంట్రాక్ట్ రివైజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అక్షర్, సిరాజ్‌ల కాంట్రాక్టూ మారొచ్చు.