News November 5, 2024
STOCK GAMESతో ఆటలొద్దు: సెబీ వార్నింగ్
లిస్టెడ్ కంపెనీల స్టాక్ ప్రైసెస్ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ సర్వీసెస్, పేపర్ ట్రేడింగ్, ఫాంటసీ గేమ్స్ అందించే యాప్స్, వెబ్ అప్లికేషన్ల జోలికి పోవొద్దని సెబీ వార్నింగ్ ఇచ్చింది. అవి చట్టవిరుద్ధమని సూచించింది. తమ వద్ద రిజిస్టరైన అడ్వైజరీలను మాత్రమే ఫాలో అవ్వాలని తెలిపింది. వారి రిజిస్ట్రేషన్ సరైందో కాదో చెక్ చేసుకోవాలంది. స్టాక్ లీగ్స్, స్కీమ్స్, పోటీల జోలికెళ్లి బాధితులుగా మారొద్దని పేర్కొంది.
Similar News
News November 5, 2024
సీనియర్ IPSకు బెదిరింపులు.. కుమార స్వామిపై కేసు నమోదు
కేంద్ర మంత్రి కుమార స్వామి, అయన కుమారుడు నిఖిల్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ అనుమతుల మంజూరు కేసులో దర్యాప్తు చేస్తున్నతనను కుమార స్వామి బహిరంగంగా బెదిరించారని ఆరోపిస్తూ సిట్ చీఫ్, ADGP చంద్రశేఖర్ ఈ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా కర్ణాటక క్యాడర్ నుంచి మరో క్యాడర్‌కు బదిలీ చేయిస్తానని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
News November 5, 2024
2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం.. IOA లేఖ
2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ మేరకు క్రీడల నిర్వహణకు ఆసక్తిని కనబరుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. ఈ లేఖను Oct 1న పంపినట్టు తెలిసింది. గతంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ 2036లో ఒలింపిక్స్ నిర్వహణపై భారత ఆకాంక్షను వ్యక్తం చేశారు.
News November 5, 2024
సరస్వతి పవర్ భూములు పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్
AP: పల్నాడు జిల్లా మాచవరంలో సరస్వతి పవర్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు పవన్ వద్ద వాపోయారు. ‘అప్పట్లో తక్కువ ధరకే భూములు లాక్కున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా కంపెనీ పెట్టలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ సంస్థకు ఇచ్చిన లీజును రద్దు చేయాలి. లేదంటే పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించాలి’ అని వారు డిమాండ్ చేశారు.