News October 6, 2025

మీ పిల్లల్ని స్కూల్‌కు పంపకండి: BAS

image

ఇకపై పిల్లలను తమ స్కూళ్లకు పంపకండంటూ TGలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(BAS) యాజమాన్యం పేరెంట్స్‌కు లేఖ రాసింది. రెండేళ్లుగా ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజు చెల్లించకున్నా అప్పులు చేసి మరీ నెట్టుకొస్తున్నామని పేర్కొంది. ఇవాళ్టి నుంచి విద్యార్థుల్ని పాఠశాలల్లోకి అనుమతించమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని 238 BASల్లో చదువుతున్న 23వేల మంది SC, 7వేల మంది ST విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.

Similar News

News October 6, 2025

అధిక వర్షాలు.. కూరగాయ పంటల్లో జాగ్రత్తలు

image

భారీ వర్షాల సమయంలో పొలంలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపేలా చూసుకోవాలి. లేకుంటే పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాలతో విత్తనం మొలకెత్తనప్పుడు లేదా లేత మొక్కలు దెబ్బతిన్నప్పుడు నర్సరీలోనే నారు పెంచుకోవాలి. అంతర సేద్యం చేసి కలుపును తొలగించాలి.

News October 6, 2025

కూరగాయల పంటలపై అధిక వర్షాల ప్రభావం

image

అధిక వర్షాల వల్ల నీటిలో మునిగిన కూరగాయల పంటల్లో చీడపీడలు, కలుపు బెడద పెరుగుతుంది. టమాటాలో పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు సోకే అవకాశం ఉంది. వంగలో ఆకులు పసుపు రంగులోకి మారటం, పూతరాలటం, అక్షింతల పురుగు, బాక్టీరియా మచ్చ తెగులు, కాయకుళ్లు తెగులు సోకే ఛాన్సుంది. మిరపలో ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు కనిపిస్తాయి. తీగజాతి కూరగాయల్లో అక్షింతల పురుగు, పండు ఈగ, బూడిద తెగులు సోకే అవకాశం ఉంది.

News October 6, 2025

అధిక వర్షాలు- కూరగాయ పంటల్లో తెగుళ్ల నివారణకు సూచనలు

image

ఎండు తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లేదా మెటాలాక్సిల్ +మాంకోజెబ్ 2 గ్రాములను కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజం 1గ్రా కలిపి పిచికారీ చేయాలి. టమాట, వంగ, క్యాప్సికంలో బాక్టీరియా మచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి. బూజు తెగులుకు లీటరు నీటికి డైమెథోమోర్ఫ్ 1.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.