News August 14, 2024
మూవీ వీడియోలను షేర్ చేయకండి: హరీశ్ శంకర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాను చూస్తోన్న అభిమానులు తమ సంతోషాన్ని వీడియోల రూపంలో X వేదికగా పంచుకుంటున్నారు. ఈక్రమంలో ఈ సినిమా సన్నివేశాలను రివీల్ చేసే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హరీశ్ శంకర్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే సిల్వర్ స్క్రీన్పై చూసేటప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ పోతుందని తెలిపారు.
Similar News
News October 25, 2025
మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన వ్యక్తి అరెస్ట్

ఉమెన్స్ వరల్డ్ కప్లో SAతో మ్యాచ్ కోసం ఇండోర్(MP)కు వెళ్లిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న హోటల్ నుంచి కేఫ్కు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు ప్లేయర్లను బైక్పై వచ్చిన ఆకతాయి అసభ్యంగా తాకి పారిపోయాడు. వారు జట్టు మేనేజ్మెంట్కు విషయం చెప్పగా సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు అకీల్ ఖాన్ను అరెస్ట్ చేశారు.
News October 25, 2025
వరుస డకౌట్ల తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో కోహ్లీ హాఫ్ సెంచరీ బాదారు. 56 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. ఆయనకు ఇది 75వ హాఫ్ సెంచరీ. తొలి 2 వన్డేల్లో డకౌట్ల తర్వాత విరాట్ ఫామ్ అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోహిత్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు. ఆయన 80కి చేరువలో ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతుండటంతో భారత్ విజయం వైపు పయనిస్తోంది. గెలుపుకు మరో 66 రన్స్ కావాలి.
News October 25, 2025
టెన్త్ పబ్లిక్ పరీక్షలపై సన్నాహాలు షురూ

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. మార్చిలో వీటిని చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తోంది. మార్చి 16నుంచి ఆరంభించాలని ఎస్సెస్సీ బోర్డు ప్రతిపాదించింది. అయితే ఇంటర్మీడియెట్ పరీక్షలు FEB 23 నుంచి MAR 24 వరకు జరుగుతాయి. కెమిస్ట్రీ వంటి ముఖ్య సబ్జెక్టు పేపర్లు 17వ తేదీ వరకు ఉన్నాయి. దీంతో టెన్త్ పరీక్షలు ఏ తేదీ నుంచి ప్రారంభమవుతాయనే దానిపై ఆ శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


