News October 1, 2024
నేరాలకు పాల్పడే వారిని వదలొద్దు: సీఎం

AP: నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎంతటి వారైనా వదిలి పెట్టవద్దని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజకీయ ముసుగులో అరాచకాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి కేసులపై అధికారులతో చర్చించారు. పోలీసుల పని తీరులో మార్పు కనిపించాలని, చిన్న భూకబ్జా జరిగినా బాధ్యులకు శిక్షపడేలా చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పినట్లు సమాచారం.
Similar News
News December 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 86 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
సమాధానం: మధుర మీనాక్షి అమ్మవారు. ఈ దేవత ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మధురలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 4, 2025
బొగ్గు గనుల నుంచి విష వాయువులు

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కేందౌది బస్తీ ప్రాంతంలోని బొగ్గు గనుల నుంచి విష వాయువులు వెలువడుతున్నాయి. ఇప్పటికే స్థానికంగా ఒక మహిళ మరణించగా 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలోని 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డేంజర్ జోన్లో ఉన్న ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. 3 అంబులెన్సులను ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంచినట్లు తవ్వకాలు జరుపుతున్న BCCL ప్రతినిధి తెలిపారు.
News December 4, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(D) చిట్టమూరులో 88.5mm, చింతవరంలో 81mm, నెల్లూరులో 61mm, పాలూరులో 60mm వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.


