News December 21, 2024

సీఎంను ఏకవచనంతో మాట్లాడొద్దు: కేటీఆర్‌తో స్పీకర్

image

సీఎం రేవంత్ రెడ్డికి గౌరవం ఇవ్వాలని KTRకు స్పీకర్ సూచించారు. సభానాయకుడైన రేవంత్‌ను ఏకవచనంతో మాట్లాడొద్దని పేర్కొన్నారు. గౌరవమనేది ఇచ్చి పుచ్చుకోవాలని, తమకు గౌరవమిస్తే తాము కూడా గౌరవంగా మాట్లాడతామని కేటీఆర్ జవాబిచ్చారు. ‘మా నాయకుడు కేసీఆర్‌ను వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేం కూడా అదే తరహాలో స్పందిస్తాం. నేనేం తిట్టట్లేదు కదా? పేరు పెట్టి పిలిచాను అంతే కదా?’ అంటూ వివరణ ఇచ్చారు.

Similar News

News November 6, 2025

రైతులు ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి నాదెండ్ల

image

AP: ఈ క్రాప్‌లో నమోదైన ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పెట్టుబడి రాయితీ చెల్లిస్తే.. ఆ సర్వే నంబరులో సాగు చేసిన పంటను కొనుగోలు చేయరంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఈ నెలలో 11 లక్షలు, DECలో 25 లక్షలు, JANలో 8 లక్షలు, FEBలో 3 లక్షల మె.టన్నులు, మార్చిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News November 6, 2025

గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు

image

మ్యాప్స్‌లో గూగుల్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. జెమినీ ఏఐ, వాయిస్ ఇంటరాక్షన్, సేఫ్టీ నోటిఫికేషన్లు, ట్రాఫిక్ అలర్ట్స్, యాక్సిడెంట్లు జోన్ల వార్నింగ్, మెట్రో టికెట్ బుకింగ్స్ సదుపాయాలు తెస్తోంది. వాయిస్ ఇంటరాక్షన్‌తో డ్రైవింగ్‌లో ఉండగానే రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు, ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. రైడర్లు బైక్ ఐకాన్, రంగును మార్చుకోవచ్చు. రోడ్డు గరిష్ఠ వేగం కూడా తెలుసుకునే ఫీచర్ వస్తోంది.

News November 6, 2025

జీవితం సంతోషంగా మారాలంటే..?

image

రాగద్వేషాలను వదిలిపెట్టి, మన ఇంద్రియాలకు సాక్షిగా ఉన్న ఆ పరమాత్మను నిరంతరం ధ్యానించాలి. అలా మనం ఏకాగ్రతతో ఆయనపై భక్తి చూపి, ధ్యానం చేసినప్పుడు, ఈ దేహమే నేను అనే అహంకారం నశించిపోతుంది. దేహాభిమానం తొలగిపోతుంది. అప్పుడు సుఖదుఃఖాలు మనల్ని బాధించవు. ఇక బయటి ఆలోచనలు, కోరికలు పక్కన పెట్టాలి. మనసును పరమాత్మపై లగ్నం చేయాలి. ఫలితంగా నిజమైన శాంతి, ఆత్మనిర్భరత లభిస్తాయి. అప్పుడే జీవితం సంతోషమయం. <<-se>>#WhoIsGod<<>>