News October 17, 2024
యాంటీ BJP ఓట్లు చీలొద్దు: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో AAP వ్యూహమిదేనా?

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేయడం లేదని తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీలో బలపడటం పైనే ఫోకస్ పెట్టిందని సమాచారం. ఆ 2 రాష్ట్రాల్లో యాంటీ BJP ఓట్లు చీలకూడదని, ఇండియా కూటమిని బలోపేతం చేయాలని భావిస్తోందట. మహారాష్ట్ర AAP యూనిట్ పోటీకి ఇష్టపడుతున్నా అధిష్ఠానం అనుమతి ఇవ్వకపోవచ్చని తెలిసింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, MP సందీప్ పాఠక్ ఈ మేరకు సంకేతాలు పంపించారు.
Similar News
News December 31, 2025
శివలింగం ధ్వంసం చేసింది హిందువే: SP

AP: ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఈ పని చేసింది తోటపేటకు చెందిన శీలం శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆలయ సిబ్బందితో అతనికి డ్రైనేజీ విషయంలో గొడవలయ్యాయి. వారిని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశాడు. నిందితుడు క్రిస్టియన్ కాదు హిందువే. అతని ఒంటిపై టాటూలు కూడా ఉన్నాయి. అతను వాడిన వస్తువులు, స్కూటీ, దుస్తులు సీజ్ చేశాం’ అని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.
News December 31, 2025
రాజస్థాన్‌లో 150KGల అమ్మోనియం నైట్రేట్ సీజ్.. ఇద్దరు అరెస్ట్

న్యూఇయర్ సంబరాలకు రెడీ అవుతున్న వేళ రాజస్థాన్‌లో భారీగా అమ్మోనియం నైట్రేట్, పేలుడు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. డిస్ట్రిక్ట్ స్పెషల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో యూరియా మాటున తరలిస్తున్న 150KGల అమ్మోనియం నైట్రేట్‌ను గుర్తించి సీజ్ చేశారు. 200 ఎక్స్‌ప్లోజివ్ బ్యాటరీలు, 1100 మీటర్ల వైర్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని DSP తెలిపారు.
News December 31, 2025
ట్రంప్ ఎఫెక్ట్.. గ్రీన్ కార్డున్నా ప్రయాణించడానికి భయం!

USలో ఉంటున్న వలసదారులు ఇప్పుడు ప్రయాణాలంటేనే భయపడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం నిఘా పెంచడంతో దాదాపు 27% మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు, ఇమిగ్రెంట్స్ తమ ట్రిప్పులు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇతర దేశాలకే కాదు.. USలో ప్రయాణించడానికీ వెనకాడుతున్నారు. విమానాశ్రయాల్లో చెకింగ్ కఠినం చేయడం, ICEకి సమాచారం ఇస్తుండటంతో ఆందోళన పెరిగింది. అక్రమ వలసదారులే కాదు H-1B వీసా ఉన్నవారూ రిస్క్ తీసుకోవట్లేదు.


