News August 30, 2024

ఇసుక పంపిణీలో రాజకీయ ఒత్తిళ్లకు లోనుకావొద్దు: ముకేశ్ కుమార్

image

AP: ఉచిత ఇసుక సరఫరా విషయంలో కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేసుకోవాలని గనులు, అబ్కారీ శాఖ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా సూచించారు. ఏమాత్రం రాజకీయ ఒత్తిళ్లకు లోనుకావొద్దని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 11 నుంచి అమలులోకి రానున్న నూతన ఇసుక పాలసీపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్‌పై అవగాహన లేని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం సచివాలయంలో ఓ ఉద్యోగిని కేటాయించాలని సూచించారు.

Similar News

News November 23, 2025

ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

image

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.

News November 23, 2025

రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ్లోబల్ సమ్మిట్‌

image

DEC 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో TG ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు 2వేల మంది ప్రముఖులు రానున్నారు. రాష్ట్ర లక్ష్యాలు, ప్రణాళికలు వివరించేలా ప్రభుత్వం ‘TG రైజింగ్-2047’ డాక్యుమెంట్‌ను రూపొందించి ఆవిష్కరించనుంది. ఈ నెల 25 నుంచి CM రేవంత్ వివిధ శాఖలతో సమీక్షించి డాక్యుమెంట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడం, భారీగా పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యం.

News November 23, 2025

మూర్ఛ జన్యుపరమైన సమస్య

image

ఫిట్స్ ఒక దీర్ఘకాలిక రుగ్మత. దాదాపు 70% మూర్ఛ కేసులు జన్యుపరమైన కారణాలతో సంబంధం కలిగి ఉంటాయని వారు పేర్కొంటున్నారు. 2018లో ‘Neuron’ జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 622 మంది మూర్ఛ రోగుల DNAను అధ్యయనం చేయగా వారిలో మూర్ఛ వ్యాధికి కారణమయ్యే 19 కొత్త జన్యువులను పరిశోధకులు గుర్తించారట. ఈ జన్యు మార్పులు మెదడు కణాల మధ్య సంకర్షణను దెబ్బతీస్తాయని, ఫలితంగా మూర్ఛ వస్తుందని నిపుణులు గుర్తించారు.