News March 26, 2025
ఎంపీ మిథున్రెడ్డిపై తొందరపాటు చర్యలొద్దు: హైకోర్టు

AP: వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మద్యం కేసులో ఏప్రిల్ 3 వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీ పోలీసులను ఆదేశించింది. అయితే ఎంపీకి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.
Similar News
News December 3, 2025
తిరుపతిలో హోటల్ ఫుడ్పై మీరేమంటారు..?

తిరుపతికి రోజూ లక్షలాది మంది భక్తులు, ఇతర ప్రాంత ప్రజలు వస్తుంటారు. ఈక్రమంలో వందలాది హోటళ్లు తిరుపతిలో ఏర్పాటయ్యాయి. నిబంధనల మేరకు ఇక్కడ ఫుడ్ తయారు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిల్వ చేసిన మాసం, ఇతర పదార్థాలతో వంటలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూమంత్రంగానే తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వందలాది రూపాయలు తీసుకుంటున్నప్పటికీ హోటళ్లు నాణ్యమైన ఫుడ్ ఇవ్వడం లేదు. దీనిపై మీ కామెంట్.
News December 3, 2025
రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.
News December 3, 2025
లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.


