News December 12, 2024

ఆ దావాలను తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

image

ప్రార్థనా స్థలాలపై దాఖలయ్యే దావాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తీసుకోవద్దని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్లో తీర్పులు చెప్పొద్దని దేశంలోని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, 4 వారాల్లోగా వీటిపై సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల హక్కులను హరిస్తోందని పిటిషన్ దాఖలైంది.

Similar News

News December 12, 2024

ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది?

image

కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో <<14859693>>ఈ చట్టాన్ని<<>> ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 1947, AUG 15 నాటికి ఉన్న మతపరమైన స్థలాలను మరో మతానికి చెందిన స్థలాలుగా మార్చడానికి అధికారం ఉండదు. ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. అయోధ్య రామ మందిరాన్ని ఈ చట్టం నుంచి మినహాయించారు. చట్టం తీసుకొచ్చే నాటికి కోర్టులో దీనిపై వ్యాజ్యం నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

News December 12, 2024

కీర్తి సురేశ్‌కు సమంత స్పెషల్ నోట్

image

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాలో సమంత స్పెషల్ పోస్ట్ చేశారు. కీర్తి పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ ‘అందమైన ఈ జంటకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జోడీ ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషంతో ఉండాలి’ అని రాసుకొచ్చారు. కాగా వీరిద్దరూ ‘మహానటి’ సినిమాలో నటించారు.

News December 12, 2024

గుకేశ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

ప్రపంచ చెస్ ఛాంఫియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్(18)ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మెచ్చుకున్నారు. కాగా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ నిలవగా, రెండో వ్యక్తిగా గుకేశ్ నిలిచారు.