News October 6, 2024

రికార్డుల గురించి ఆలోచించను: రూట్

image

జట్టు విజయానికి సహకరించడమే తనను ముందుకు నడిపిస్తుందని ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అన్నారు. వ్యక్తిగతంగా ఆటను ఆస్వాదిస్తానని, తానెప్పుడూ రికార్డుల గురించి ఆలోచించనని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడుతున్నంత వరకు టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపారు. కాగా, టెస్టుల్లో రూట్ మరో 71 రన్స్ చేస్తే అలిస్టర్ కుక్ (12,472)ను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా నిలుస్తారు.

Similar News

News March 22, 2026

కేరళంలో షిగెల్లా వ్యాధి.. చిన్నారి మృతి!

image

కేరళంలోని కోళికోడ్‌ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువయల్‌ పంచాయతీలో ఇప్పటికే 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీంతో రక్త విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.

News March 22, 2026

ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్

image

ఎలాంటి కండీషన్స్ లేకుండా హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల గడువు విధించారు. లేదంటే ఇరాన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో పాటు చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటికే ఇరాన్ అణుకేంద్రం సమీపంలో మిస్సైల్ దాడులు జరిగిన నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన ఈ ‘అల్టిమేటం’ హాట్ టాపిక్‌గా మారింది.

News March 22, 2026

ఆయిల్ పామ్ అంటే?

image

‘ఆయిల్ పామ్’ అనేది వంట నూనె అవసరాల కోసం సాగు చేసే వాణిజ్య పంట. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇస్తుంది. దీని పండ్ల గుజ్జు నుంచి పామాయిల్, గింజల నుంచి పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. మొక్క నాటిన 3-4 ఏళ్ల నుంచి దిగుబడి మొదలై 25-30 ఏళ్ల వరకు లాభాలిస్తుంది. దీని సాగుకు సమృద్ధిగా నీరు, 21°C-32°C మధ్య ఉష్ణోగ్రత అవసరం. అంతర పంటలకు అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వాల రాయితీ రైతుకు మేలు చేస్తుంది.