News June 16, 2024
నన్ను టార్చర్ చేయకండి: ఫ్యాన్స్‌కు రేణూ దేశాయ్ విన్నపం
తనను టార్చర్ చేయడం ఆపాలని సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పవన్ అభిమాని రేణూను ట్యాగ్ చేస్తూ ‘వదినగారూ దేవుడిని పెళ్లి చేసుకుని, ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టుంటే బాగుండేది’ అని కామెంట్ చేశారు. దీనికి ఆమె రిప్లై ఇస్తూ ‘పవన్‌ను నేను వదిలేయలేదు. ఆయనే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారు’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
Similar News
News January 4, 2025
ట్రాఫిక్ సమస్యలో బెంగళూరు టాప్!
నగరాలు అభివృద్ధి చెందుతుంటే అంతే వేగంగా ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతుంటాయి. వాహనాలు పెరగడంతో ఒక్కోసారి ఒక్క కిలోమీటర్ వెళ్లేందుకు పది నిమిషాలు పడుతుంటుంది. అయితే, ఆసియాలోని నగరాల్లో అత్యధికంగా బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని తేలింది. 10kms వెళ్లేందుకు ఇక్కడ 28.10 నిమిషాలు పడుతుంది. అదే దూరం వెళ్లేందుకు పుణేలో 27.50ని, మనీలాలో 27.20ని, తైచుంగ్‌లో 26.50ని, సపోరోలో 26.30నిమిషాలు పడుతుంది.
News January 4, 2025
200+ టార్గెట్ నిర్దేశిస్తే భారత్‌దే విజయం!
సిడ్నీ టెస్టులో 2వ ఇన్నింగ్స్ ఆడుతున్న IND 145 రన్స్ లీడ్‌లో ఉంది. AUSకు 200+ టార్గెట్ నిర్దేశిస్తే భారత్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి. 40 ఏళ్లలో సిడ్నీలో 200+ పరుగుల లక్ష్యాన్ని 2 సార్లే ఛేదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 6 వికెట్లు కోల్పోయినా క్రీజులో జడేజా, సుందర్ ఉండటంతో లీడ్ 200 దాటే అవకాశాలున్నాయి. తొలి సెషన్లో వికెట్ పడకుండా కాపాడుకుంటే ఆసీస్ ముందు భారీ లక్ష్యం ఉంచవచ్చు.
News January 4, 2025
మా సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరే: KTR
TG: సీఎం రేసులో తాను, కవిత ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఎప్పటికీ కేసీఆరే తమ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వాలా లేదా అనే విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్ చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు.