News September 25, 2024
ఈ సిటీల్లో నాన్ వెజ్ ముట్టుకోరు!

అసలు మాంసాహారమే ముట్టుకోని నగరాలు కూడా భారత్‌లో ఉన్నాయి. శ్రీరాముడు జన్మించినట్లు చెప్పే అయోధ్య, కృష్ణుడు తిరుగాడినట్లు చెప్పే బృందావనం, నరనారాయణులు తపస్సు చేసిన రిషీకేశ్, జైనులకు పవిత్రమైన పాలిటానా, మౌంట్ అబూ, బ్రహ్మదేవుడి ఆలయానికి పేరొందిన పుష్కర్ నగరాల్లో నాన్ వెజ్ నిషేధం. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిషేధం లేకపోయినా అక్కడి వారు స్వచ్ఛందంగా మాంసాహారానికి దూరం పాటిస్తారు.
Similar News
News February 26, 2025
వెండితెరపై ‘శివుడు’

టాలీవుడ్‌లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణువు పాత్రలతో పాటు శివుడి పాత్రలోనూ స్టార్ హీరోలు అలరించారు. ఎన్టీఆర్(దక్షయజ్ఞం), కృష్ణంరాజు (శ్రీ వినాయక విజయం), శోభన్ బాబు(పరమానందయ్య శిష్యుల కథ), మెగాస్టార్ చిరంజీవి(శ్రీ మంజునాథ), జగపతిబాబు(పెళ్లైన కొత్తలో-సాంగ్‌లో) భోళా శంకరుడి పాత్రలో కనిపించారు. వీరిలో ఎవరు శివుడి పాత్రలో మెప్పించారో కామెంట్ చేయండి?
News February 26, 2025
పాండవులు నిర్మించిన క్షేత్రం కేదార్‌నాథ్

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉత్తరాఖండ్‌లోని <<15578815>>కేదార్‌నాథ్<<>> క్షేత్రం 11వది. మహాభారత యుద్ధం తర్వాత వ్యాసమహర్షి సలహా ప్రకారం, పాండవులంతా కేదార్‌నాథ్ వెళ్లి శివుని ఆలయం నిర్మించి, క్షమాపణ కోరుతూ తపస్సు చేశారని స్థలపురాణం చెబుతోంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడే నిర్వాణం పొందారు. విపరీతమైన మంచు కారణంగా ఈ మందిరం ఏప్రిల్- నవంబర్‌ల మధ్యే తెరిచి ఉంటుంది. కాలినడకన, గుర్రాలు, డోలీలపై ఈ ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
News February 26, 2025
శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

మహాశివరాత్రి కోసం ముస్తాబైన ఆలయం నుంచి శివలింగాన్ని దొంగిలించిన ఘటన గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో జరిగింది. అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న పురాతన శివలింగాన్ని నిన్న దొంగలు ఎత్తుకెళ్లారు. లింగం కనిపించకపోవడంతో ఆలయ అధికారులు స్కూబా డైవర్లతో సముద్రంలో గాలిస్తున్నారు. శివరాత్రి ముందు రోజే ఇలా జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.