News August 23, 2025

ఇతర అవసరాలకు యూరియాను వాడొద్దు: అచ్చెన్న

image

AP: రబీ సీజన్ కోసం ఇప్పుడే యూరియాను కొనుగోళ్లు చేయొద్దని మంత్రి అచ్చెన్నాయుడు రైతులను కోరారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్లించవద్దని చెప్పారు. వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘యూరియా పంపిణీలో చాలాచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి. మార్క్ ఫెడ్ నుంచి సకాలంలో రైతు సేవా కేంద్రాలకు యూరియా తరలించాలి’ అని ఆదేశించారు.

Similar News

News March 16, 2026

యానాం: ఉండేది ఏపీలో.. కానీ!

image

పుదుచ్చేరి(UT) అసెంబ్లీ <<19389988>>ఎన్నికలకు షెడ్యూల్<<>> వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా APలోని కాకినాడ దగ్గరున్న యానాం సీటుకూ ఎలక్షన్ జరగనుంది. ఇది భౌతికంగా APలో ఉన్నా పుదుచ్చేరి పాలనా పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. 1954 వరకు ఫ్రెంచ్ పాలనలో యానాం ఉండింది. కానీ 1963లో అప్పటి ఒప్పందాల మేరకు UTగా పాండిచ్చేరి, కారైకల్, మాహేలతోపాటు విలీనమైంది. యానాం-పుదుచ్చేరి మధ్య సుమారు 780km దూరం ఉండటం గమనార్హం.

News March 16, 2026

మార్చి 16: చరిత్రలో ఈరోజు

image

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటార్యులు జననం
*1901: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం
*1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం
*1963: భారత దేశ రెండో ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి మరణం
*జాతీయ టీకా దినోత్సవం

News March 16, 2026

పాక్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. సిరీస్ కైవసం!

image

పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 279 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. సల్మాన్ అఘా(106) సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, నహిద్ రాణా 2, ముస్తాఫిజుర్ రహ్మాన్ 3, హొస్సేన్ 1 వికెట్ తీశారు. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1తో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది.