News October 31, 2024

చెత్త రికార్డు వద్దు.. మూడో టెస్టులో గెలవండి: ఆకాశ్ చోప్రా

image

కివీస్‌తో రేపటి నుంచి జరిగే మూడో టెస్టులో గెలిచి పరువు నిలపాలని రోహిత్ సేనకు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. WTC పాయింట్లు కూడా మనకెంతో ముఖ్యమన్నారు. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఎప్పుడూ వైట్‌వాష్‌ కాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి అవాంఛిత రికార్డును బ్రేక్ చేయొద్దని సూచించారు. ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ పదవీ కాలంలో అనవసర రికార్డులు ఉన్నాయని, మరొకటి చేర్చొద్దని కోరారు.

Similar News

News November 17, 2024

BGT: తొలి టెస్టుకు కెప్టెన్ ఎవరంటే?

image

ఆస్ట్రేలియాతో జరిగే BGTలో తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన స్థానంలో బుమ్రా భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తారని తెలిపాయి. ఇటీవల రోహిత్ భార్య కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబంతోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే హిట్ మ్యాన్ రెండో టెస్టుకు జట్టుకు అందుబాటులో ఉంటారన్నాయి. మరోవైపు గాయపడిన కేఎల్ రాహుల్ కోలుకున్నట్లు సమాచారం.

News November 17, 2024

తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్ష

image

TG: గ్రూప్-3 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ పేపర్-1, పేపర్-2 పరీక్ష జరగగా రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుంది. కాగా నిమిషం నిబంధన కారణంగా పలువురు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.

News November 17, 2024

BGT: నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేస్తారని తెలుస్తోంది. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించగల సత్తా ఉండటంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆయనను తుది జట్టులో ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. నితీశ్‌తోపాటు దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్‌లలో ఒకరు డెబ్యూ చేస్తారని టాక్.