News October 5, 2025

వన్డేల్లో కొనసాగడం ఇష్టం లేదా?

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ జట్టులో ఉంటారా అనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ మ్యాచులు ఆడాలని BCCI చెబుతూనే ఉంది. రోహిత్, కోహ్లీ రంజీల్లో అడపాదడపా ఆడి తప్పుకున్నారు. మళ్లీ తిరిగి దేశవాళీ మ్యాచుల్లో ఆడతామన్న సంకేతాలివ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే వారికి వన్డేల్లోనూ కొనసాగేందుకు ఆసక్తి లేదేమోనని సెలక్టర్లు భావిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News October 5, 2025

వారిని కఠినంగా శిక్షించాలి: KTR

image

మధ్యప్రదేశ్‌ చింద్వారాలో కోల్డ్రిఫ్ <<17918452>>దగ్గు మందు<<>> తాగిన 11 మంది చిన్నారులు మృతిచెందిన ఘటనపై KTR దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా ఘోరం. ఈ మందు తయారు చేసిన కంపెనీ మేనేజ్మెంట్, దానిని అప్రూవ్ చేసిన అథారిటీలను కఠినంగా శిక్షించాలి. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. కారకులందరినీ జైలులో వేయాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.

News October 5, 2025

5,346 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

image

<>DSSSB<<>> 5,346 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 9 నుంచి నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

News October 5, 2025

వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

image

మటన్‌లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.