News August 24, 2024
డెంగ్యూ కేసులపై ఆందోళన వద్దు: హెల్త్ డైరెక్టర్

TG: వాతావరణంలో మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని డీహెచ్ రవీందర్ తెలిపారు. డెంగ్యూ కేసులపై ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు. ‘ఈ ఏడాది ఇప్పటివరకు 4,600కు పైగా కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, ఖమ్మం సహా 10 జిలాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. HYD జిల్లాలో 1,697 కేసులు నమోదయ్యాయి. ఇంటింటి సర్వే, పరీక్షలు చేస్తూ చికిత్స అందిస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News January 31, 2026
HYD: ఏం బాధొచ్చిందో ఈ తల్లికి!

తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పటాన్చెరులోని హాస్టల్లో ఉన్న తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి మరీ విజయశాంతి సూసైడ్ చేసుకున్నారు. ప్లాట్ఫారం మీద నడుస్తున్న ఫొటోలో కొడుకు వద్దు అమ్మ అన్నట్లు సంకేతం కనిపిస్తోంది. కాగా, విజయశాంతి భర్తకు సౌదీలో ఉద్యోగం. పిల్లలు బాగా చదువుతారు. ఏ కష్టాలు లేని బిడ్డ ఎందుకు ఇలా చేసిందో? అని మృతురాలి <<19011053>>తల్లి కన్నీరు<<>> పెట్టుకుంది.
News January 31, 2026
యాడ్స్లో ‘కింగ్’ నంబర్-1.. రెండో స్థానంలో మిస్టర్ కూల్

ఇండియన్ అడ్వర్టైజింగ్ స్క్రీన్ టైమ్లో 8% వాటాతో కింగ్ ఖాన్ షారుఖ్ నంబర్-1 స్థానంలో నిలిచినట్లు మార్కెటింగ్ మైండ్ సంస్థ వెల్లడించింది. అన్ని ఛానళ్లలో కలిపి రోజుకు సగటున 27 గంటలపాటు ఆయన యాడ్స్ ప్రసారమవుతున్నాయని తెలిపింది. రెండో స్థానంలో ధోనీ(రోజుకు 22Hr యాడ్స్) ఉన్నారని పేర్కొంది. ఆ తర్వాత వరుసగా అక్షయ్, రణ్వీర్ సింగ్, అమితాబ్, అనన్య, రణ్బీర్ కపూర్, అనుష్కా శర్మ, ద్రవిడ్, కోహ్లీ ఉన్నారంది.
News January 31, 2026
వారంలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు

AP: తిరుపతికి చెందిన బయ్యాల చాందిని వారం వ్యవధిలోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆమె బుధవారం జుడీషియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరారు. 2 రోజుల క్రితం గ్రూప్-2లో జాబ్ వచ్చింది. తాజాగా శుక్రవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో DSP క్యాడర్ పోస్ట్కు ఎంపికయ్యారు. ఆమె తండ్రి భాస్కర్ TTD రిసెప్షన్-1 డిప్యూటీ EOగా పని చేస్తున్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని చాందిని నిరూపించారు.


