News February 17, 2025

GBSపై ఆందోళన చెందొద్దు: కృష్ణబాబు

image

AP: జీబీఎస్‌ అంటువ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. ఎవరైనా తిమ్మిర్లు, నడవలేని స్థితిలో ఉంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని ఆయన సూచించారు. ‘జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నాం. రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. అన్ని జీజీహెచ్‌ల్లో ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 18, 2025

జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

image

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్‌తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.

News September 18, 2025

నేను అన్ని మతాలను విశ్వసిస్తా: CJI గవాయ్

image

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ వస్తున్న విమర్శలపై CJI గవాయ్ స్పందించారు. ‘నేను అన్ని మతాలను విశ్వసిస్తా, గౌరవిస్తా. నా వ్యాఖ్యల్ని SMలో తప్పుగా చూపించారు’ అని అన్నారు. ఖజురహోలో ధ్వంసమైన విష్ణువు విగ్రహ పునర్నిర్మాణానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను ఇటీవల SC తిరస్కరించింది. ఈ సందర్భంగా ‘ASIని సంప్రదించండి లేదా ఏదైనా చేయమని దేవుడినే వేడుకోండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 18, 2025

అసెంబ్లీ సమావేశాలు కుదింపు

image

AP: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల పనిదినాలను ప్రభుత్వం 8 రోజులకు కుదించింది. ఈనెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత అసెంబ్లీని ఈనెల 30 వరకు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో <<17749258>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే. అటు రేపు మధ్యాహ్నం రూ.1.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.