News July 17, 2024
ఆందోళన చెందొద్దు.. క్షేమంగానే ఉన్నా: నారాయణమూర్తి

తన ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. ఆయన <<13647927>>అస్వస్థత<<>>కు గురయ్యారనే వార్తలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ నారాయణమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయతో కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు.
Similar News
News February 15, 2026
జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే కావాలి: పవన్

AP: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రారంభించారు. రూ.2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. 150 మందితో పార్టీని ప్రారంభించగా 2024 ఎన్నికల తర్వాత అది 12.98 లక్షలకు చేరుకుందని పవన్ చెప్పారు. జనసేన భావజాలాన్ని అర్థం చేసుకొని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి అవసరమని వ్యాఖ్యానించారు.
News February 15, 2026
ఉపవాసాలు – రకాలు.. మీది ఏ రకం?

ఉపవాసాలు 5 రకాలు. అందులో మొదటిది, కఠినమైనది నిర్జల ఉపవాసం. ఇందులో నీరు కూడా తాగరు. రెండో రకం జల ఉపవాసం. ఇందులో నీటిని మాత్రమే తాగుతారు. ఇక మూడోది ద్రవ ఉపవాసం. ఇందులో కొబ్బరినీళ్లు వంటి పానీయాలు తీసుకోవచ్చు. నాలుగోది ఫలోపవాసం. ఇందులో పాలతో పాటు పండ్లు కూడా తీసుకోవచ్చు. ఇక చివరిది సాత్విక ఉపవాసం. ఇందులో సగ్గుబియ్యం వంటి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. ఇందులో మీది ఏ ఉపవాసం? COMMENT
News February 15, 2026
చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, ICWA అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.60వేలు, మేనేజర్ పోస్టుకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://chial.org/career/


