News August 6, 2024
రుణమాఫీ కాని వారు ఆందోళన చెందొద్దు.. లబ్ధిచేకూరుస్తాం: తుమ్మల

TG: ఎన్నికష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ‘ఇప్పటికే 2 విడతలు అమలు చేశాం. ఈ నెల 15న ₹2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో CM రేవంత్ ప్రారంభిస్తారు. పాస్‌బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా మాఫీ చేస్తున్నాం. సాంకేతిక కారణాలతో 30వేల మంది అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. వారు ఆందోళన పడొద్దు. పొరపాట్లు సరి చేసి అర్హులకు లబ్ధి చేకూరుస్తాం’ అని హామీ ఇచ్చారు.
Similar News
News January 20, 2026
153 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (UIIC)లో 153 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ (BE/B.Tech/BSc/B.Com/BBA/BCA) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21- 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైన వారికి స్టైపెండ్ నెలకు రూ.9,000 చెల్లిస్తారు. డిగ్రీలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.uiic.co.in
News January 20, 2026
రాష్ట్రంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరితేదీ

TGSRTCలో 198 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేస్తోంది. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్ట్ చేస్తారు.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు www.tgprb.inలో అందుబాటులో ఉంటాయి.
News January 20, 2026
రేపటి నుంచి JEE మెయిన్స్

TG: JEE మెయిన్స్ సెషన్-1 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉ.9 గం.-మ.12 వరకు, మ.3గం.-సా.6 వరకు 2 సెషన్స్ ఉంటాయి. HYD, SEC, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ సహా రాష్ట్రంలో 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 40వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


