News March 24, 2025

ఆందోళన వద్దు.. ఆదుకుంటాం: సీఎం

image

AP: అకాల వడగండ్ల వర్షాల కారణంగా పంట నష్టపోయి అనంతపురం(D)లో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై CM చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు. వర్షాలకు 4 జిల్లాల్లో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. దీంతో ప్రభుత్వ పరంగా వారికి సాయం అందించాలని CM ఆదేశించారు. నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందొద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Similar News

News December 3, 2025

కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై జేసీ సమీక్ష

image

కోనసీమ జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమి స్తోందని, ఖరీఫ్ సీజన్(2025-26)కు సంబంధించి అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఉండాలన్నారు.

News December 3, 2025

ALERT.. అతి భారీ వర్షాలు

image

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

News December 3, 2025

ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుదల

image

ఈ నెల 10 నుంచి జరగనున్న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్లోకి<<>> వెళ్లి తమ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి టెట్‌కు 2,41,509 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. రెండు విడతల్లో పరీక్షలు జరగనుండగా ఫస్ట్ సెషన్ ఉ.9.30 గంటల నుంచి మ.12 గంటల వరకు నిర్వహిస్తారు. సెకండ్ సెషన్ మ.2.30 గంటల నుంచి సా.5 గంటల వరకు జరుగుతుంది.